సర్జికల్ స్ట్రైక్స్.. భారత్‌పై పాక్ మంత్రి సంచలన ఆరోపణలు.. పాకిస్తాన్ భయపడుతోందా..!?

భారతదేశంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎస్ఎం ఖురేషి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ భూభాగంపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించేందుకు..

సర్జికల్ స్ట్రైక్స్.. భారత్‌పై పాక్ మంత్రి సంచలన ఆరోపణలు.. పాకిస్తాన్ భయపడుతోందా..!?

Updated on: Dec 19, 2020 | 9:49 AM

భారతదేశంపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం ఖురేషి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ భూభాగంపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోందన్నారు. భారత్‌లో నెలకొన్న సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు పాకిస్తాన్‌పై దాడి చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోందంటూ నిందారోపణలు చేశారు. అబుదాబీలో పర్యటిస్తున్న ఎస్ఎం ఖురేషీ అక్కడ మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే చర్యలో భాగంగా మరోసారి పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని యోచిస్తోందన్నారు. ఆ మేరకు ప్రణాళికలు రచిస్తోందన్నారు. దానికి సంబంధించి విశ్వసనీయ సమాచారం తమ వద్ద ఉందని ఖురేషి మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయితే ఈసారి భారత్ అలాంటి దాడులకు పాల్పడితే తిప్పికొట్టడానికి పాక్ సిద్ధంగా ఉందన్నారు. భారత్ దాడులు చేస్తుంటే తామేమీ చేతులు కట్టుకుని కూర్చోబోమన్నారు. తమ దేశానికీ ఆయుధ సంపత్తి ఉందని, ఈ విషయాన్ని భారత్ గుర్తెరగాలని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌కు పాక్ భయపడుతోందంటూ ఇండియన్ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us