Punjab Attacks: పంజాబ్‌లోని మొహాలీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది. ఇంటలిజెన్స్ ఆఫీస్ అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. అక్కడ లభించిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాకెట్ దాడి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు.