కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర చిగురుటాగులా వణుకుతోంది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కోవిడ్ దాటికి ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 221 మందికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. వైరస్ కారణంగా 22 మంది చనిపోయారు.
మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2 వేలకు దగ్గరగా చేరుకున్నాయి. ప్రస్తుతానికి మహారాష్ట్రలో మొత్తం కొవిడ్ కేసులు 1,982గా నమోదయ్యాయి. తాజా మరణాలు 22తో కలుపుకొని మొత్తం కరోనా రోగుల మరణాలు 149గా అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలో మొత్తం ఇప్పటి వరకూ 41 వేల శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరిపించారు. 217 మంది బాధితులు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.