ఐఎండీ హెచ్చ‌రికః ఆ మూడు రాష్ట్రాల‌కు రెడ్ అల‌ర్ట్‌

దక్షిణ మహారాష్ట్రకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు.. ముంబై స‌హా, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలను క‌మ్మేశాయ‌ని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్ర‌క‌టించింది. దీని ప్ర‌భావంతో, మహారాష్ట్ర పశ్చిమ తీరం అటు, దక్షిణాది రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

ఐఎండీ హెచ్చ‌రికః ఆ మూడు రాష్ట్రాల‌కు రెడ్ అల‌ర్ట్‌
Weather Forecast
Follow us

|

Updated on: Jun 15, 2020 | 12:27 PM

దక్షిణ మహారాష్ట్రకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు.. ముంబై స‌హా, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలను క‌మ్మేశాయ‌ని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్ర‌క‌టించింది. దీని ప్ర‌భావంతో, మహారాష్ట్ర పశ్చిమ తీరం అటు, దక్షిణాది రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 24 గంటలలో గోవా మరియు కొంకణ్ ప్రాంతాలలో ప్రదేశాలలో భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, మేఘాలయ, చత్తీస్‌గఢ్, ఒడిశాలో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

కోయంబత్తూరు, నీలగిరి, దిండుగల్ జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ధర్మపురి, కృష్ణగిరి, తేలం, తిరువణామలై జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశముంది. అరేబియా పశ్చిమ సముద్ర ప్రాంతాలు, మధ్య తూర్పు అరేబియా సముద్రం, కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర, గోవా సముద్ర ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్న అధికారులు.. ఈ ప్రాంతాల్లో మత్స్యకారులు రెండు రోజులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు