ఆమెను తన భర్త పెద్దాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడున్న వైద్యులు సదరు మహిళకు ఎక్స్‌రే తీసి అవాక్కయ్యారు. ఏమైందని భర్తను అడగ్గా.. అతడు కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. దీంతో అనుమానమొచ్చిన డాక్టర్లు.. ఆ తర్వాత ఏం చేశారు.! ఇంతకీ వారికి అందులో ఏం కనిపించింది.? అసలేం జరిగిందో..? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాకు చెందిన దీపక్, షీలాబాయి మూడేళ్ల కిందట ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. షీలాను అతడు ఎప్పుడూ బాగా చూసుకునేవాడు. ప్రస్తుతం ఆమె నెలన్నర గర్భవతి. అంతా బాగుందనుకునేలోపు.. దీపక్ చెడు సావాసాలకు బానిసై.. దొంగతనాలు, దోపిడీలు, అక్రమ ఆయుధాల రవాణా చేయడం మొదలుపెట్టాడు. ఇది ఆమెకు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఓ రోజు దీపక్ తన దగ్గరున్న నాటు తుపాకీ తీసుకుని ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాకు వెళ్తుండగా.. అతడి భార్య షీలా అడ్డుకుంది. అతడి చేతుల్లోని తుపాకీని తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె చర్యకు ఆవేశానికి లోనైన దీపక్.. తుపాకీతో షీలాను కాల్చాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుడు ఏమైందని అడగ్గా.. గుడికి వెళ్లినప్పుడు కర్ర గుచ్చుకుని గాయమైందని అబద్దం చెప్పాడు దీపక్. ఇక షీలాకు రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాడు స్థానిక వైద్యుడు.
దీంతో దీపక్ తన భార్య షీలాను పెద్దాసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు ఆమెకు ఎక్స్‌రే తీసి అవాక్కయ్యారు. పొలం పనులు చేస్తుండగా వేటగాళ్ళు కాల్చారని దీపక్ చెప్పడంతో.. అనుమానపడిన డాక్టర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే షీలా పరిస్థితి విషమించడంతో ఆమెను మెడికల్ కాలేజీకి తరలించి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. సదరు మహిళ వెన్నులో నుంచి 315 ఎంఎం బుల్లెట్ బయటకు తీశారు. అయితే కాసేపటికే షీలా మరణించింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దీపక్‌ను పట్టుకుని.. అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు