Uttar Pradesh: భార్య మిస్సైందని కంప్లైంట్‌.. కట్‌ చేస్తే.. భర్తకు దిమ్మతిరిగే న్యూస్ చెప్పిన పోలీసులు!

ఇటీవలు జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కూతురికి కాబోయే భర్తలతో ఓ మహిళ లేచిపోయిన సంఘటన ఒకటయితే.. కూతురితో పెళ్లని చెప్పి..కూతురి తల్లితో వివాహం జరిపించిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన వింటే మీరు షాక్ అవుతారు. తన భార్య తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. తన భార్య తప్పిపోలేదు లేచిపోయిందని తెలిసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే...

Uttar Pradesh: భార్య మిస్సైందని కంప్లైంట్‌.. కట్‌ చేస్తే.. భర్తకు దిమ్మతిరిగే న్యూస్ చెప్పిన పోలీసులు!
Thajmahal

Updated on: Apr 21, 2025 | 10:43 AM

అలీఘర్‌: ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్‌లో ప్రాంతంలో నివసించే షకీర్‌ అనే వ్యక్తి అంజుమ్‌ అనే యువతితో కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కుటుంబ సభ్యుల వివాహం ఉండడంతో షకీర్‌ ఇటీవలే వేరే ఊరికి వెళ్లాడు. వివాహం ముగించుకొని ఏప్రిల్ 15న తిరిగి ఇంటికి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు, తన భార్య పిల్లలు కనిపించలేదు. దీంతో కంగారు పడిన షకీర్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అంజుమ్‌ కోసం వెతుకుతున్న సమయంలోనే అసలు విషయం వెలుగలోకి వచ్చింది. భార్య మిస్సయిందని ఇక్కడ భర్త బాధపడుతుంటే, భార్య మాత్రం మరో వ్యక్తి ఢిల్లీలోని తాజ్‌ మహాల్ దగ్గర ఎంజాయ్ చేస్తుందని షకీర్ తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. ఆమె లేచిపోయిందని తెలుసుకున్న పోలీసులు ఆగ్రా పోలీసులను సంప్రదించి, ఆ జంట కోసం గాలింపు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…