Huge Robbery: నమ్మి తాళమిస్తే నట్టేటా ముంచారు.. భార్య, భర్త కలిసి ఏంత పని చేశారంటే..

|

Nov 22, 2021 | 6:32 AM

Huge Robbery: నమ్మి చేరదిస్తే.. అసలు మోసం చేశారు ఇంటి పనిమనిషులు. అన్నం పెట్టిన ఇంటకే కన్నం పెట్టి దాదాపు రూ.55 లక్షలకు పైగానే సొమ్ము కొల్లగొట్టారు.

Huge Robbery: నమ్మి తాళమిస్తే నట్టేటా ముంచారు.. భార్య, భర్త కలిసి ఏంత పని చేశారంటే..
Money
Follow us on

Huge Robbery: నమ్మి చేరదిస్తే.. అసలు మోసం చేశారు ఇంటి పనిమనిషులు. అన్నం పెట్టిన ఇంటకే కన్నం పెట్టి దాదాపు రూ.55 లక్షలకు పైగానే సొమ్ము కొల్లగొట్టారు. అనంతరం అక్కడి పారిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఈస్ట్ బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన శ్రీధర్(47) వృత్తిరీత్యా అకౌంటెంట్. అయితే, వీరి ఇంటికి కాపలాగా సెక్యూరిటీ గార్డును కృష్ణ ను నియమించుకున్నారు. ఇంట్లో పనిమినిషిగా అతని భార్య జానకికి పెట్టుకున్నారు. వీరిద్దరూ ఉండేందుకు ఇంట్లోనే ఓ గదిని కూడా ఇచ్చారు. అయితే, తాజాగా శ్రీధర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన.. సెక్యూరిటీ గార్డు, అతని భార్య భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ. 47 లక్షల నగదు, సుమారు రూ.8 లక్షల విలువైన 170 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం శ్రీధర్, కుటుంబ సభ్యలు వచ్చి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు, అతని భార్య ఇద్దరూ కనిపించడం లేదు. ఇంట్లోకెళ్లి బీరువా చూడగా.. డబ్బు, నగలు కనిపించడం లేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు శ్రీధర్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కృష్ణ, జానకిని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

రెండు రోజుల ముందే పోలీసుల హెచ్చరించారు..
కాగా, కృష్ణ, జానకి కనిపించకపోవడంతో వారే ఈ చోరీకి పాల్పడ్డారని భావించి శ్రీధర్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం సెక్యూరిటీ గార్డు కృష్ణ ఓ దొంగతనం కేసులో దొరికిపోయాడు. అయితే, అతను అలాంటి వాడు కాదని, మంచివాడంటూ శ్రీధర్ వకల్తా ఇచ్చి స్టేషన్ నుంచి విడిపించాడు. అప్పటికే అనుమానించిన పోలీసులు.. సెక్యూరిటీ గార్డును మార్చుకోండి అంటూ శ్రీధర్‌కు వార్నింగ్ ఇచ్చారు. కానీ, నమ్మి జైలు నుంచి విడిపించిన ఫలితం.. ఇల్లును గుల్ల చేసి సొత్తునంతా ఎత్తుకెళ్లారు.

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..