HPCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

HPCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొషన్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మేరకు తాజాగా నోటిఫికేషన్‌ వి..

HPCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

Updated on: Mar 04, 2021 | 2:27 AM

HPCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొషన్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మేరకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది.మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది. అయితే ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు అందించునున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆయా పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

విద్యార్హతల వివరాలు..

ఏఐసీటీఈ నుంచి అప్రూవల్ పొందిన లేదా యూజీసీ గుర్తింపు పొందిన కాలేజీల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు చేసిన వారు ఆయా పోస్టులకు అప్లై చేయడానికి అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు..

-మెకానికల్ ఇంజనీర్ విభాగంలో మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ లేదా మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అలాగే సివిల్ ఇంజనీర్ విభాగంలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగంలో మరో 25 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.

ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ విభాగంలో 25 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..

ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులుఅధికారిక వెబ్ సైట్లో మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు రూ. 1180ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్లో కొన్ని వర్గాల వారికి మినహాయింపు ఇచ్చారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్‌ను చూడాలి.

Post Office: పోస్టాఫీసుల్లో నగదు ఉపసంహరణలు, డిపాజిట్లలపై చార్జీల వసూలు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

Loading...
Unable to load recommendations.
Follow Us