Amit Shah Kashmir Visit: కశ్మీర్‌లో అమిత్ షా పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు.. రెండేళ్ల తర్వాత తొలిసారిగా..

Amit Shah to visit Kashmir: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ (అక్టోబర్ 23) కశ్మీర్‌లో పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు.

Amit Shah Kashmir Visit: కశ్మీర్‌లో అమిత్ షా పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు.. రెండేళ్ల తర్వాత తొలిసారిగా..
Amit Shah
Follow us

|

Updated on: Oct 23, 2021 | 10:22 AM

Amit Shah to visit Kashmir: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ (అక్టోబర్ 23) కశ్మీర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా తొలిసారిగా అక్కడ పర్యటనకు వెళ్తుండటం విశేషం. జమ్ముకశ్మీర్‌కు కల్పిస్తున్న ప్రత్యేక హోదాను 2019 ఆగస్టు 5న రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం… లడఖ్, జమ్ము అండ్ కశ్మీర్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. శ్రీనగర్ నుంచి షార్జాకు తొలి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం అవుతున్న వేళ అమిత్ షా.. కశ్మీర్‌ లోయలో పర్యటనకు వెళ్తున్నారు.

అమిత్ షా మూడు రోజుల పర్యటన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇటీవల స్థానికేతరులన్న కారణంగా కొందరు అమాయక పౌరులను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అమాయక పౌరులను టార్గెట్ చేస్తున్న ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా అక్కడ పర్యటనకు వెళ్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శ్రీనగర్‌‌లోని జవహర్ నగర్‌లో బీజేపీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. తన పర్యటనలో భాగంగా అమిత్ షా ఇక్కడకు వస్తారని తెలుస్తోంది. అలాగే షేరీ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(SKICC)కి వెళ్లే అన్ని మార్గాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అమిత్ షా ఎస్‌కేఐసీసీ‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.

అమిత్ షా పర్యటన నేపథ్యంలో కశ్మీర్ లోయలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. మరీ ముఖ్యంగా శ్రీనగర్‌లో బందోబస్తు పెంచారు.

ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో దాదాపు 50 కంపెనీల అదనపు పారామిలిటరీ బలగాలు కశ్మీర్ లోయలో పహారా కాస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

శ్రీనగర్‌తో పాటు కశ్మీర్ లోయలోని పలుచోట్ల సీఆర్పీఎఫ్ దళాల బంకర్లు ఏర్పాటు చేశారు. కశ్మీర్ లోయలోని పలు రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

భద్రతా చర్యల్లో భాగంగా ఇటీవల స్థానికేతర వలస కార్మికులు హత్యకు గురైనన ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

కశ్మీర్ లోయలోని ప్రధాన మార్గాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఉగ్రవాదుల హింసాత్మక కార్యక్రమాల కారణంగానే వాహనాలను సీజ్ చేయడం, మొబైల్ ఇంటర్నెట్ సేవలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. దీనికి కేంద్ర హోం అమిత్ షా పర్యటనతో సంబంధం లేదంటూ ఆయన ట్వీట్ చేశారు.

Also Read..

Python Video: బాబోయ్‌ కొండచిలువ.. రోడ్డుకు అడ్డంగా.. కోళ్లును మింగేస్తున్న వీడియో..

India Coronavirus: కరోనా మరణ మృదంగం.. దేశంలో భారీగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?