అయ్యో పాపం.. ఎంత కష్టమొచ్చే.. పెళ్లి కోసం పిల్ల కావాలంటూ ఆఫీసర్‏కు ఆర్జీ పెట్టుకున్న యువకుడు..

|

Jun 27, 2024 | 9:31 AM

అతనొక యువ రైతు.. పదేళ్ల నుంచి జీవిత భాగస్వామి కోసం వెతుకుతూనే ఉన్నాడు.. కానీ.. పెళ్లి కావడం లేదు.. దీంతో మానసికంగా కుంగిపోయాడు.. ఓ వైపు పెళ్లిచేసుకునేందుకు ఎవరూ అంగీకరించడం లేదు.. మరోవైపు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.. దీంతో సరాసరి అధికారుల దగ్గరకు వెళ్లాడు.. జనస్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరై.. పిల్లను వెతికిపెట్టాలంటూ కోరాడు.

అయ్యో పాపం.. ఎంత కష్టమొచ్చే.. పెళ్లి కోసం పిల్ల కావాలంటూ ఆఫీసర్‏కు ఆర్జీ పెట్టుకున్న యువకుడు..
Karnataka
Follow us on

అతనొక యువ రైతు.. పదేళ్ల నుంచి జీవిత భాగస్వామి కోసం వెతుకుతూనే ఉన్నాడు.. కానీ.. పెళ్లి కావడం లేదు.. దీంతో మానసికంగా కుంగిపోయాడు.. ఓ వైపు పెళ్లిచేసుకునేందుకు ఎవరూ అంగీకరించడం లేదు.. మరోవైపు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.. దీంతో సరాసరి అధికారుల దగ్గరకు వెళ్లాడు.. జనస్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరై.. పిల్లను వెతికిపెట్టాలంటూ కోరాడు..దీంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు.. ఈ ఘటన కర్నాటకలోని కొప్పల్ జిల్లాలో చోటుచేసుకుంది.. కర్నాటకలోని కొప్పల్ జిల్లాలో జనస్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరైన రైతు సంగప్ప.. తనకు వధువును కనుగొనడంలో సహాయం చేయమని కోరాడు.. నేరుగా జిల్లా కమీషనర్ నళిని అతుల్‌ దగ్గరికి వెళ్లిన సంగప్ప.. తన ఆవేదనను వెల్లబుచ్చుకున్నాడు.. తాను గత 10 సంవత్సరాలుగా వధువు కోసం వెతుకుతున్నానని.. కానీ.. తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ అంగీకరించడంలేదని పేర్కొన్నాడు. తనకు జీవిత భాగస్వామిని కనుగొనడంలో సహాయం చేయాలని కోరుతూ దరఖాస్తును సమర్పించాడు. గత దశాబ్ద కాలంగా జరుగుతున్న ఈ పరిణామం తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని ఆయన అన్నారు.

“సార్, నాకు గత 10 సంవత్సరాల నుండి పెళ్లికి కావడం లేదు. చాలా కాలంగా వెతుకుతున్నాను. దయచేసి నాకు వధువును కనుగొనడంలో సహాయపడండి. దయచేసి ఎవరైనా నాకు వధువును కనుగొనడానికి ఒక బ్రోకర్ ను కేటాయించి అతని ద్వారా సహాయం చేయండి”.. అని సంగప్ప తన విన్నపంలో పేర్కొన్నారు.

ప్రజా ఫిర్యాదుల ఫోరమ్‌కు ఏవేవో దరఖాస్తులు వస్తాయని.. కానీ.. ఈసారి మాత్రం ఇలాంటి దరఖాస్తుతో ఆశ్చర్యపోయామని అధికారులు తెలిపారు. వాస్తవానికి కర్ణాటక ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. పిల్లలు దొరకడం లేదంటూ గతంలో పాదయాత్రలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయ నేతలు కూడా వేదికలపై పెళ్లిళ్ల ముచ్చట్లు తెచ్చిన సందర్భాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..