భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు

| Edited By:

Jul 29, 2020 | 2:46 PM

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. అనేక రోడ్డు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా..

భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు
Follow us on

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. అనేక రోడ్డు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా బద్రినాథ్‌ వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో.. అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు
చేపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పాలిగడ్‌ సమీపంలో యమునోత్రి దారిని మూసేశారు. లంబాగడ్‌,పీపల్ కోటి తంగ్డీ, చమోలీలోని పగల్నలా, పిథోర్‌గడ్ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటుంది.

కాగా, చమోలీ జిల్లాలో మంగళవారం సాయంత్రం కొడియా ప్రాంతంలో బద్రినాథ్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసిస సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.