Hathras Stampede: శ్మశానంగా మారిన సత్సంగ్‌ మైదానం.. మృతదేహాలను చూసి తట్టుకోలేక పాపం కానిస్టేబుల్‌..

అప్పటిదాకా ఆధ్యాత్మిక శోభతో పులకరించిన ఆ ప్రాంతం క్షణాల్లో శోక సముద్రంగా మారిపోయింది. ప్రవచనాలు వినేందుకు వచ్చిన భోలే బాబా భక్తులు విగతజీవులయ్యారు. కొద్దిసేపటి క్రితం దాకా తమతోనే ఉండి... అంతలోనే అనంతలోకాలకెళ్ళిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది.

Hathras Stampede: శ్మశానంగా మారిన సత్సంగ్‌ మైదానం.. మృతదేహాలను చూసి తట్టుకోలేక పాపం కానిస్టేబుల్‌..
Crime News
Follow us

|

Updated on: Jul 03, 2024 | 9:25 AM

అప్పటిదాకా ఆధ్యాత్మిక శోభతో పులకరించిన ఆ ప్రాంతం క్షణాల్లో శోక సముద్రంగా మారిపోయింది. ప్రవచనాలు వినేందుకు వచ్చిన భోలే బాబా భక్తులు విగతజీవులయ్యారు. కొద్దిసేపటి క్రితం దాకా తమతోనే ఉండి… అంతలోనే అనంతలోకాలకెళ్ళిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యు ఘోష వినిపించింది. భక్తులు ఒక్కసారిగా ఏగబడటంతో తోపులాటకు దారితీసి.. ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక ప్రాణాలు116 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.. చనిపోయినవారిలో 106 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. హాథ్రస్‌లోని సికింద్రా రావ్‌ ట్రామాకేర్‌ సెంటర్‌లో మృతదేహాలను ఉంచారు.. ఇప్పటిదాకా 72 డెడ్‌బాడీలను గుర్తించారు. ఆసుపత్రుల్లోనూ పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారు.. విషాదాన్ని చూసి తట్టుకోలేక ఓ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది..

ఇటా జిల్లాలోని అవఘర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవి.. హత్రాస్ సత్సంగ్‌లో మరణించిన వ్యక్తుల మృతదేహాలను చూసి గుండెపోటుకు గురయ్యాడని అధికారులు తెలిపారు. ఎటా మెడికల్ కాలేజీలో మరణించినట్లు తెలుస్తోంది.. హర్తాస్ సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత, అతను ఎటాహ్ మెడికల్ కాలేజీకి డ్యూటీపై వెళ్లాడు.. అక్కడికి చేరుకోగానే రవి మృతదేహాలను చూసి కళ్లు తిరగాయి.. అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

హత్రాస్ జిల్లా సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతిభాన్‌పుర్‌లో భోలే బాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమ సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ కార్యక్రమంలో పవిత్ర జలం పేరుతో భక్తులకు నీళ్లు ప్రసాదం ఇస్తారు.. ఈ జలం స్వీకరిస్తే సర్వరోగాలు పోయాయని నమ్మకం.. దీంతో దేశం నలుమూలల నుంచి దాదాపు 4లక్షల మంది వరకూ హాథ్రాస్‌ చేరుకున్నారు. బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో మధ్యాహ్నం వేళ ఈ తొక్కిసలాట జరిగింది. దాంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు.

రతిభాన్పూర్ సత్సంగ్ కార్యక్రమంలో విషాదంపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.. గాయపడ్డ వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించింది.. హాథ్రస్ ఘటనపై లోక్‌సభలో ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..