మెడలో స్టెతస్కోప్‌తో శివాని రాజశేఖర్ .. క్రేజీ పిక్స్

Rajeev 

05 July 2024

సీనియర్‌ హీరో డాక్టర్‌ రాజశేఖర్‌, జీవితల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌ హీరోయిన్ గా సిల్వర్‌ స్క్రీన్ మీద ఎంట్రీ ఆకట్టుకుంటుంది. 

ఆతర్వాత మోడల్‌గా మారి రాణిస్తోంది. ఆమధ్య జరిగిన ఫెమినా మిస్‌ ఇండియా-2022 పోటీల్లో శివానీ పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య రెండు , మూడు చిత్రంలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది ఈ క్యూటీ బ్యూటీ. 

2 స్టేట్స్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత అద్భుతం అనే సినిమా చేసింది. 

తెలుగులోనే కాదు తమిళ్ లోనూ ఈ చిన్నది సినిమాలు చేసింది. అన్బరివు, నెంజుక్కు నీతి అనే సినిమాల్లో నటించింది శివాని. 

రీసెంట్ గా కోట బొమ్మాళి పీ.ఎస్ సినిమాలో నటించి మెప్పించింది ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మెడలో స్టెతస్కోప్ తో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. యాక్టర్ గా సినిమాలు చేస్తూనే.. డాక్టర్ గాను సేవలందించాలనుకుంటుంది శివాని.