ఈ ఎర్రటి పువ్వుల రేకులు ఆరోగ్యానికి ఓ వరం.. అనేక వ్యాధులు దూరం 

05 July 2024

TV9 Telugu

Pic credit - pexels

 సుగంధ ద్రవ్యాలలో అత్యంత ఖరీదైన మసాలాగా ఖ్యాతిగాంచింది కుంకుమపువ్వు . రుచి, వాసన, రంగుతో పాటు పోషణలో కూడా అద్భుతమైన గుణాలు కలిగి ఉంది. 

అత్యంత ఖరీదైన మసాలా

పువ్వుల కేసరాల నుంచి  తయారు చేసే కుంకుమపువ్వులో అనేక యాంటీఆక్సిడెంట్లు అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. .

పోషకాలు మెండు 

కుంకుమపువ్వు తీసుకోవడం కంటి చూపును కాపాడుకోవడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. రెటీనాను రక్షిస్తుంది.  రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

కళ్ళకు మేలు 

కుంకుమపువ్వు చర్మ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఛాయను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. తినడంతో పాటు ముఖానికి కూడా రాసుకోవచ్చు.

చర్మ ఆరోగ్యం

ప్రస్తుతం యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. సమతుల్య ఆహారపు అలవాట్లతో పాటు కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

గుండె ఆరోగ్యానికి 

కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల మెదడుకు కూడా మేలు జరుగుతుంది.  ఒత్తిడిని తొలగించడమే కాదు  జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

జ్ఞాపకశక్తి బూస్టర్ 

ఉదర సంబంధిత సమస్యలకు కుంకుమపువ్వు  నివారిస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది మేలు చేస్తుంది.

జీర్ణక్రియ కోసం 

కుంకుమపువ్వు వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కనుక దీనిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.  ముఖ్యంగా గర్భధారణ సమయంలో కుంకుమపువ్వును తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

తక్కువగా తీసుకోండి