రైతు చట్టాలకు నిరసనగా గురువారం చండీగఢ్ లో జరగనున్న ప్రదర్శనకు హాజరయ్యేందుకు వఛ్చిన మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ బాదల్ ను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల వాణిని వినిపించడానికి వఛ్చిన తమను అరెస్టు చేశారని, కానీ తమ నోళ్లను మూయించలేరని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అకాలీదళ్ గురువారం వేర్వేరుగా మూడు చోట్ల రైతు ర్యాలీలను నిర్వహించింది. ఎన్డీయే ప్రభుత్వపతనం ఖాయమని ఈ సందర్భంగా ప్రసంగించిన రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. వారితో హర్ సిమ్రత్ బాదల్ కూడా ఏకీభవించారు.