Azadi Ka Amrit Mahotsav: సాధారణంగా దేశ భక్తిని చూపించమంటే మనమంతా అవ్వాకవుతాం.. కాని ఒక్కోసారి తెలియకుండానే మనలో దేశ భక్తి బయటకు కనబడుతోంది. ఎలా అనుకుంటున్నారా.. ప్రజలందరిలో దేశ భక్తి ప్రపంచానికి తెలుస్తోంది కేంద్రప్రభుత్వం చేపట్టిన హర్ గర్ తిరంగ కార్యక్రమం ద్వారా.. అదెలా అనుకుంటున్నారా.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వజ్రోత్సవాలను కేంద్రప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈఏడాది ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈపిలుపునకు యావత్తు దేశం సానుకూలంగా స్పందిస్తోంది.
చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇళ్లపైనే కాకుండా తమ వాహనాలకు, సైకిళ్లకు జాతీయ జెండా పెట్టుకుని తమలో దేశ భక్తిని చాటుతున్నారు. చాల ప్రాంతాల్లో హర్ గర్ తిరంగ పేరుతో ర్యాలీలు చేస్తున్నారు. మరికొంత మందైతే ఎంతో వినూత్నంగా హర్ గర్ తిరంగను సెలబ్రేట్ చేసేస్తున్నారు. ఒకమ్మాయి ఒక దేశభక్తి గీతానికి జాతీయ జెండా చేతబట్టి.. చెయ్యిలు వదిలేసి సైకిల్ తొక్కడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది వండర్ ఫుల్ అంటూ కితాబిస్తున్నారు తమ కామెంట్ల ద్వారా, ఇలానే ఇంకొన్నే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గూడ్స్ ట్రైన్ వెనుకాల జాతీయ పతాకం రెపరెపలాడుతూ వెళ్తుండటం, చిన్నారులు జాతీయ పతాకం చేతబూని ర్యాలీలు ఇలా అనేక వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది తమ ఇళ్లపై, వాహనాలకు జాతీయ జెండాలను పెట్టి జైహింద్ అంటున్నారు.
सारे जहां से अच्छा…. ??#HarGharTiranga pic.twitter.com/qf7OLbunOe
Goods Trains में Guard के Brakevan में इसी प्रकार MB-Division में भी राष्ट्रीय ध्वज #AmritMahotsav के अवसर पर लगाया जा सकता है। pic.twitter.com/hrL15vf5dx— Shivendra Kumar Pathak (@Shivend49805034) August 12, 2022
Wonderful ?
Patriotic fervour by creating a very beautiful and amazing balance?#ViralVideo #IndiaAt75 #HarGharTiranga #AzadiKaAmritMahotsav #IndependenceDay2022 pic.twitter.com/w8yDXEYTR4
— Rekha Sharma (@Rekha1sharma1) August 12, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..