అయోధ్య రామాలయంలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠతో హిందువుల 500 ఏళ్ల కోరిక నెరవేరింది. అయితే ఇప్పుడు భారత దేశంలో ఆలయ శిథిలాలపైనే మరో మందిరం ఉందంటూ జ్ఞానవాపి మసీదుపై పై ASI సర్వే రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మసీదు కింద అతి పెద్ద ఆలయం ఆనవాళ్లున్నట్టలు ASI గుర్తించింది. తవ్వకాల్లో తెలుగు భాషతో పాటు 32 కీలక శాసనాధారాలు లభ్యమయ్యాయి. జనార్ధన, రుద్ర, ఉమేశ్వర పేర్లతో శాసనాలు సర్వేలో బయటపడ్డాయి. 17వ శతాబ్ధంలో ఆలయాన్ని కూల్చినట్టు రిపోర్ట్‌లో నిర్ధారణ చేశారు. ఆలయ స్తంభాలతోనే ప్రస్తుత జ్ఞానవాపి మసీదును నిర్మించారని ASI రిపోర్ట్‌లో స్పష్టం చేసింది.
వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో పురావస్తు పరిశోధన శాఖ ( ASI ) నిర్వహించిన సర్వే నివేదిక రిపోర్ట్ ను హిందూ, ముస్లిం ఇరు పక్షాలకు ఇవ్వడానికి వారణాసి జిల్లా కోర్టు అంగీకరించింది. ఈమేరకు జడ్జి ఎకె విశ్వేశ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే రిపోర్ట్ కావాలని రాఖీసింగ్, తదితరులు పిటిషన్ సమర్పించడంతో కోర్టు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ, ముస్లిం పక్షాలకు చెందిన 11 మంది రిపోర్ట్ కాపీ కోసం కోర్టును అభ్యర్థించడంతో వారి విన్నపాన్ని మన్నించి కోర్టు సర్వే నివేదికను ఇరు వర్గాలకు అందజేసింది.
గురువారం మధ్యాహ్నం వరకు రెండు వర్గాలకు చెందిన 11 మంది ఆ ప్రతుల కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుదారుల్లో ఐదుగురు హిందూ వర్గంతోపాటు అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ, కాశీవిశ్వనాథ్ ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, వారణాసి జిల్లా మెజిస్ట్రేట్, ఉన్నారు. గత ఏడాది జులై 21న జిల్లా కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ASI బృందం శాస్త్రీయ సర్వే నిర్వహించింది.
భారత పురావస్తు శాఖ వారణాసి కోర్టులో సర్వే నివేదికను సమర్పించింది. 1500 పేజీల నివేదికను కోర్టులో సమర్పించింది ASI. మసీదులో సర్వే నిర్వహించినప్పుడు లభించిన వస్తువుల వివరాలను రిపోర్ట్‌లో పొందుపర్చారు. ASI సీల్డ్‌కవర్‌లో కోర్టుకు నివేదికను అందచేసింది. జ్ఞానవాపి మసీదులో 100 రోజుల పాటు ASI సైంటిఫిక్ సర్వేను నిర్వహించింది. సర్వేను వీడియోగ్రఫీ కూడా చేశారు. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని 1669లో మొఘల్ చక్రవర్తి జౌరంగాజేబ్ ధ్వంసం చేసి మసీదును నిర్మించారని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇక జ్ఞానవాపి మసీదు కేసులో తదుపరి విచారణను వారణాసి కోర్టు ఫిభ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
అయోధ్యలో వివాదాస్పద బాబ్రీమ సీదు కూల్చి వేత కేసులో రామాలయ నిర్మాణం కోసం తీర్పు వచ్చినప్పటి నుంచి.. వారణాసిలోని జ్ఞానవాపి మసీదుతో పాటు, మధురలో శ్రీకృష్ణుడి ఆలయం, తాజ్ మహల్ కూడా తేజో మహల్ అనే ఆలయం ఉందంటూ పలు హిందూ సంఘాలు ASI సర్వే కోరుతూ కోర్టులను ఆశ్రయించాయి. అయితే వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఆలయం ఆనవాళ్లపై సర్వే చేయాలని జిల్లా కోర్టును ఆశ్రయించిన హిందూ వర్గానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ దిశగా సర్వే జరిగింది. అయితే సర్వే నివేదికలో బయటపడిన కీలక అంశాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
అయోధ్య రామాలయ నిర్మాణం ఓ వైపు కొనసాగుతున్న తరుణంలోః.. ఇటు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశంలోనూ తమకు అనుకూలంగా ASI సర్వే నివేదిక రావడం హిందూ వర్గంలో సంతోషం నింపింది. ఈ సర్వే నివేదిక ద్వారా జ్ఞానవాపి మసీదు అంశంలో తాము చాలా ఏళ్లుగా చేస్తున్న వాదనకు బలం చేకూరిందని హిందువులు చెబుతున్నారు. త్వరలోనే అయోధ్య తరహాలోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశంలోనూ కోర్టు పరిధిలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వారు ఆశిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి…