Gunnies Record: భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ గా పనిచేస్తూనే సైక్లింగ్ హాబీగా చేస్తూ వచ్చారు. అదే సైక్లింగ్ లో రెండు ప్రపంచ రికార్డులు అదీ ఒకదాని తరువాత ఒకటి సాధించారు. భారత సైన్యాధికారి లెఫ్టినెంట్ కర్నల్ భారత్ పన్ను రెండు గిన్నెస్ రికార్డులు సాధించారు. సోలో సైక్లింగ్ లో ఈ అరుదైన ఘనత సాధించారు. ఆర్మ్ అధికారులు చెప్పినదాని ప్రకారం పన్ను గతేడాది అక్టోబర్ 10న లే నుంచి మనాలి వరకూ ఉన్న 472 కిలోమీటర్ల దూరాన్ని 35 గంటల 25 నిమిషాల్లో సైకిల్ పై అధిగమించారు. అదేవిధంగా మళ్ళీ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతాలను కలుపుతూ ఉన్న గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్డు మొత్తం సైకిల్ పై చుట్టేశారు. మొత్తం 5,942 కిలోమీటర్ల ఈరహదారిని 14 రోజుల 23 గంటల 52 నిమిషాల్లో సైకిల్ పై చుట్టబెట్టేశారు పన్ను.
ఇండియా గేటు వద్ద అక్టోబర్ 16 ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర మళ్ళీ అదే ప్రదేశంలో అక్టోబర్ 30న పూర్తి అయింది. ఈ రెండు సైకిల్ యాత్రలు రికార్డు సమయంలో పూర్తి అయినవే. దీంతో ఈ రెండు ఘనతలను గిన్నెస్ బుక్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇప్పుడు పంపించింది.
Also Read: Nethra Kumanan: సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత..తొలి మహిళ క్రీడాకారిణిగా రికార్డ్..
ఏబీ డివిలియర్స్ స్టైల్‌కి ఫిదా అయిన బాలీవుడ్ యంగ్ హీరో భార్య..! అభిమానులకు షాకింగ్ రిప్లై..