ప్రేమికుల రోజు నేపథ్యంలో.. మోదీ స్వరాష్ట్రంలో స్పెషల్ జీవో.. ఏంటంటే..

ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో స్పెషల్ జీవో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును బహిష్కరించేలా.. నడుం బిగించింది. నేరుగా బహిష్కరణ పేరు చెప్పకుండా.. చిన్నతనం నుంచే పిల్లలకు పాశ్చాత్య సంస్కృతివైపు అడుగులు వేయకుండా.. ఆరోజున తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సూరత్ జిల్లాలోని స్కూళ్లలో ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)న తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాలలన్నింటికి ఆదేశాలు కూడా జారీ చేశారు. మన దేశ […]

ప్రేమికుల రోజు నేపథ్యంలో.. మోదీ స్వరాష్ట్రంలో స్పెషల్ జీవో.. ఏంటంటే..
TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 09, 2020 | 9:47 PM

ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో స్పెషల్ జీవో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును బహిష్కరించేలా.. నడుం బిగించింది. నేరుగా బహిష్కరణ పేరు చెప్పకుండా.. చిన్నతనం నుంచే పిల్లలకు పాశ్చాత్య సంస్కృతివైపు అడుగులు వేయకుండా.. ఆరోజున తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సూరత్ జిల్లాలోని స్కూళ్లలో ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)న తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాలలన్నింటికి ఆదేశాలు కూడా జారీ చేశారు. మన దేశ సాంస్కృతిక మూలాలు విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖాధికారి పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న విద్యార్థులు తమ తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకువచ్చి, వారికి పూజలు నిర్వహించి, స్వీట్లు పంచిపెట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా విద్యాశాఖ జారీ చేసిన ఈ ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఓ నాటకమని.. కొత్త వివాదాలను తెరమీదకు తెచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని మండిపడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu