
బీహార్‌లో కుక్కను బైక్‌తో ఈడ్చుకెళ్లిన దారుణమైన వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించారు. బీహార్‌లోని గయలో కుక్కను బైక్‌కు బంధించి లాక్కెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎస్‌ఎస్పీ ఆశిష్ భారతి తెలిపారు.
వీడియోలో, ఒక వ్యక్తి గొలుసులతో కుక్కను బైక్‌కు కట్టేసి రోడ్డు వెంట ఈడ్చుకుంటూ బైక్‌పై నడుపుతున్నాడు. దాంతో స్థానిక ప్రజలు అతన్ని అడ్డుకున్నారు. ఎందుకలా చేస్తున్నావంటూ నిలదీశారు. దానికి అతడు సమాధానం చెబుతూ.. తాను కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లనని, కొద్దిసేపటికి కుక్క నడవలేకపోయిందని చెప్పాడు. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అంతేకానీ, తాను కుక్క పట్ల కఠినంగా వ్యవహరించలేదన్నాడు. పైగా తాను బైక్‌ను కూడా చాలా నెమ్మదిగా నడుపుతున్నానని, కొన్ని వందల మీటర్లు మాత్రమే ఈడ్చుకెళ్లినట్టుగా తనను తాను సమర్ధించుకున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అమానవీయ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.