Viral: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి.. తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో అంతా కొలాప్స్

|

Apr 08, 2022 | 2:17 PM

తొలి రాత్రి మనసు విప్పి మాట్లాడే క్రమంలో నవవధువు తన మనసులోని వేదనను పంచుకుంది. అయితే ఆమె చెప్పిన చేదు నిజాన్ని విని వరుడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

Viral: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి.. తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో అంతా కొలాప్స్
Calls Off Wedding
Follow us on

Trending News: ఫ్రెండ్స్, అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో ఆ జంట పెళ్లి ఎంతో వేడకగా జరిగింది. పెద్దలు వారి కొత్త ప్రయాణం బాగుండాలని ఆశీర్వదించారు. ఫ్రెండ్స్ సరదాగా కాసేపు ఆట పట్టించారు. పెళ్లి తంతు అంతా బాగా ముగిసింది. అయితే తొలిరాత్రి రోజున ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకోవాలనుకున్నారు. లైఫ్‌లో ఎదురైన అన్ని అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే వధువు చెప్పిన ఒక విషయం విన్న వెంటనే వరుడు నిర్ఘాంతపోయాడు. దీంతో అతడి ముఖంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. అంతేకాదు వారి వైవాహిక బంధానికి కూడా అక్కడే స్టాప్ పడింది. 2 కుటుంబాల్లో అప్పటివరకు ఉన్న సంతోషం పోయి దు:ఖం ఆవరించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్(madhya pradesh)​లోని గ్వాలియర్​(gwalior)లో జరిగింది.

అసలేం జరిగిందంటే….

తన లైఫ్‌లోని మంచి, చెడు అనుభవాలను భర్తతో పంచుకుంటున్న సమయంలో యువతి.. గతంలో తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది. ఈ విషయం తెలిసిన వెంటనే కంగుతిన్న భర్త.. వెంటనే ఆ వివాహాన్ని రద్దు చేసుకోవాలని భావించాడు. తాను ఆమెను ఏలుకోలేనని స్పష్టంగా చెప్పేశాడు. మరుసటి రోజే యువతిని ఆమె పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. ఇరువైపులా బంధుమిత్రులకు ఈ విషయం తెలియడంతో షాక్‌కు గురయ్యారు. తనపై అత్యాచారానికి పాల్పడింది మేనమామ కొడుకేనని ఆమె అందరితో చెప్పింది. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో తమ వివాహాన్ని రద్దు చేయాలంటూ భర్త కోర్టు మెట్లు ఎక్కాడు. యువకుడి అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. అయితే నోటీసులు మీద నోటీసులు ఇచ్చినా అతని భార్య కోర్టులో అటెండ్ అవ్వలేదు. ఇలా మూడేళ్ల పాటు సాగిన విచారణకు ఎండ్ కార్డు వేస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చింది. యువకుడు కోరిన విధంగా 2019లో జరిగిన ఆ వివాహాన్ని రద్దు చేసింది.

Also Read:Hyderabad: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. సున్నిత మనస్కులు చూడొద్దు.. క్షణకాలంలో గాల్లో కలిసిపోయిన ప్రాణం