మీరు వాహనం కొని 8 ఏళ్లు గడిచాయా! అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. లేదంటే జేబుకు చిల్లు తప్పదు..

|

Jan 25, 2021 | 11:57 PM

కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై కేంద్రం కొరడా ఝులిపిస్తోంది. పాతబడిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ

మీరు వాహనం కొని 8 ఏళ్లు గడిచాయా! అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. లేదంటే జేబుకు చిల్లు తప్పదు..
Follow us on

కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై కేంద్రం కొరడా ఝులిపిస్తోంది. పాతబడిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎనిమిది సంవత్సరాలు దాటిన వాహనదారులు ఇకనుంచి ట్యాక్స్ చెల్లించడం తప్పేట్లుగా లేదు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంతకం చేశారు. రాష్ట్రాల సంప్రదింపుల అనంతరం దీన్ని కేంద్రం నోటిఫై చేయనుందని అధికారులు వెల్లడించారు.

కాలుష్య నివారణలో భాగంగా 8 సంవత్సరాల పైబడిన రవాణా వాహనాలకు 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరణ సమయంలో ఈ ట్యాక్స్‌ వసూలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, 15 సంవత్సరాల కంటే పాత వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో పన్ను వసూలు చేస్తారని చెప్పారు.

అయితే, హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ, ఇథనాల్‌, ఎల్‌పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు కలిగిన వాహనాలకు ఈ ప్రతిపాదన నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే 15 సంవత్సరాల కంటే పాతవైన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై కొనసాగించకూడదన్న ప్రతిపాదన కూడా ఉందని పేర్కొన్నారు. పాత వాహనాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయని, అందుకే ఈ గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలుకు నిర్ణయించినట్లు తెలిపారు.

కుంభమేళాకు వచ్చే భక్తులకు కేంద్రం కొత్త నిబంధన.. ఆ రిపోర్ట్ లేకుండా అనుమతి నిరాకరణ.. కచ్చితంగా పాటించాలని సూచన..