Viral: 16ఏళ్ల బాలికను నడిరోడ్డుపై జుట్టు పట్టుకొని.. ఈడ్చుకెళ్లి.. వీడికి కొంచెం కూడా భయం, భక్తి లేవ్

తనను పెళ్లి చేసుకోవాలని 47ఏళ్ల నిందితుడు ఆమెపై ఒత్తిడి చేయగా.. అందుకు బాలికతోపాటు, ఆమె తల్లి నిరాకరించారు. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు అదును చూసి బాలికపై దాడికి దిగాడు.

Viral: 16ఏళ్ల బాలికను నడిరోడ్డుపై జుట్టు పట్టుకొని.. ఈడ్చుకెళ్లి.. వీడికి కొంచెం కూడా భయం, భక్తి లేవ్
Man Drags Minor By Hair

Updated on: Feb 20, 2023 | 9:46 AM

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని 16 ఏళ్ల బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. కత్తితో దాడి చేసి జుట్టుపట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. రాయ్‌పూర్‌లో ఓంకార్‌ తివారీ అనే 47ఏళ్ల వ్యక్తి..తన షాపులో పనిచేస్తున్న మైనర్‌ బాలికను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. అందుకు బాలికతో పాటు ఆమె తల్లి కూడా నిరాకరించారు. దీంతో ఆగ్రహంతో అమానుషంగా ప్రవర్తించాడు ఆ దుర్మార్గుడు. కత్తితో దాడి చేసి జుట్టుపట్టుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో..పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఆ బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని..నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.  బాధితురాలు కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ రికార్డు చేస్తామని తెలిపారు. కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనను కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం