వెళతారా?… తన్ని తరిమేయాలా..? బంగ్లా శరణార్థులకు ఎమ్‌ఎన్‌ఎస్‌ హెచ్చరిక

|

Feb 04, 2020 | 8:20 PM

భారత్‌లో శరణార్థులుగా ఉన్న బంగ్లాదేశీయులను గట్టిగా బెదిరించారు మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన నాయకులు.. ఇండియాను విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ పోస్టర్లు వేశారు.. కాదు కూడదని ఇక్కడే ఉంటే మాత్రం తామే వెళ్లగొట్టాల్సి వస్తుందని హెచ్చరికలతో కూడిన అల్టిమేటం ఇచ్చారు.. రాయ్‌గఢ్‌ జిల్లాలో ఎమ్‌ఎన్‌ఎస్‌ పేరిట వెలిసిన పోస్టర్లలో ఇలాంటి రాతలే ఉన్నాయి. బంగ్లాదేశీయులు మా దేశాన్ని వదిలివెళ్లకపోతే ఎమ్‌ఎన్‌ఎస్‌ స్టయిల్లో తామే గెంటేస్తామంటూ బ్యానర్లు పెట్టారు.. ఈ బ్యానర్‌లలో మహారాష్ట్ర నవనిర్మాణ్‌సేన అధినేత రాజ్‌ ఠాక్రేతో పాటు కొత్తగా […]

వెళతారా?... తన్ని తరిమేయాలా..? బంగ్లా శరణార్థులకు ఎమ్‌ఎన్‌ఎస్‌ హెచ్చరిక
Follow us on

భారత్‌లో శరణార్థులుగా ఉన్న బంగ్లాదేశీయులను గట్టిగా బెదిరించారు మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన నాయకులు.. ఇండియాను విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ పోస్టర్లు వేశారు.. కాదు కూడదని ఇక్కడే ఉంటే మాత్రం తామే వెళ్లగొట్టాల్సి వస్తుందని హెచ్చరికలతో కూడిన అల్టిమేటం ఇచ్చారు.. రాయ్‌గఢ్‌ జిల్లాలో ఎమ్‌ఎన్‌ఎస్‌ పేరిట వెలిసిన పోస్టర్లలో ఇలాంటి రాతలే ఉన్నాయి.

బంగ్లాదేశీయులు మా దేశాన్ని వదిలివెళ్లకపోతే ఎమ్‌ఎన్‌ఎస్‌ స్టయిల్లో తామే గెంటేస్తామంటూ బ్యానర్లు పెట్టారు.. ఈ బ్యానర్‌లలో మహారాష్ట్ర నవనిర్మాణ్‌సేన అధినేత రాజ్‌ ఠాక్రేతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడుఅమిత్‌ ఠాక్రే ఫోటో కూడా ఉంది.. కరడుగట్టిన హిందుత్వ పార్టీ అని జనంలో ముద్రపడాలన్నది రాజ్‌ ఠాక్రే అభిమతం కావచ్చు.. నరేంద్రమోదీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలికింది కూడా అందుకే! మొన్నటి వరకు మోదీపై విమర్శలు గుప్పించిన రాజ్‌ఠాక్రే ఇప్పుడు మోదీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.. ఇందుకు కారణం మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే! అందుకే భారతీయ జనతాపార్టీతో కలిసి హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్లాలని ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది… అందుకే పార్టీ జెండాలో కూడా మార్పులు చేసింది.. కాషాయం .. నీలం.. ఆకుపచ్చ రంగుల్లో ఉండే జెండాను హిందుత్వాన్ని ప్రతిబింబించేలా పూర్తిగా కాషాయరంగులో మార్చేశారు.. జెండా మధ్యలో ఛత్రపతి శివాజీ రాజముద్రను చేర్చారు. ఓ పక్క మహారాష్ట్ర అంతటా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుంటే ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీ ఇలాంటి పోస్టర్లు.. బ్యానర్లు పెట్టడం కలకలం రేపుతోంది.