దూకుడు పెంచిన చైనా…’గాల్వన్ వ్యాలీ మాదే’ !

లడఖ్ లోని గాల్వన్ వ్యాలీ తమదేనని చైనా ప్రకటించింది. చైనా వెస్టర్న్ థియేటర్  కమాండ్ కల్నల్ జాంగ్ షూలీ ఈ మేరకు ప్రకటన చేస్తూ.. ఇండియా కావాలనే రెచ్ఛగొట్టే దాడులు చేస్తోందని ఆరోపించారు. భారత దళాల దాడుల కారణంగా తమ సైన్యంలో చాలామంది సైనికులు మరణిస్తున్నారని అన్నారు. మరో వైపు…. భారత సైనిక  దళాలను ‘నియంత్రించాలని’ చైనా తన సైన్యాన్ని కోరింది. మన భూభాగాలను రక్షించుకోవలసిందే అని పేర్కొంది. ఇలా ఉండగా.. ఇండో-చైనా బోర్డర్ లోని తాజా […]

దూకుడు పెంచిన చైనా...'గాల్వన్ వ్యాలీ మాదే' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 16, 2020 | 7:16 PM

లడఖ్ లోని గాల్వన్ వ్యాలీ తమదేనని చైనా ప్రకటించింది. చైనా వెస్టర్న్ థియేటర్  కమాండ్ కల్నల్ జాంగ్ షూలీ ఈ మేరకు ప్రకటన చేస్తూ.. ఇండియా కావాలనే రెచ్ఛగొట్టే దాడులు చేస్తోందని ఆరోపించారు. భారత దళాల దాడుల కారణంగా తమ సైన్యంలో చాలామంది సైనికులు మరణిస్తున్నారని అన్నారు. మరో వైపు…. భారత సైనిక  దళాలను ‘నియంత్రించాలని’ చైనా తన సైన్యాన్ని కోరింది. మన భూభాగాలను రక్షించుకోవలసిందే అని పేర్కొంది.

ఇలా ఉండగా.. ఇండో-చైనా బోర్డర్ లోని తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ప్రధాని మోదీకి వివరించారు. అంతకుముందు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్.. రాజ్ నాథ్ సింగ్ నివాసానికి చేరుకుని ఆయనతో తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవాణే కూడా పాల్గొన్నారు. అటు-ఇండో-చైనా బోర్డర్ లో రోడ్డు నిర్మాణ పనులకు ఝార్ఖండ్ నుంచి లేబర్ ను తీసుకువెళ్లవలసిన రైలును రద్దు చేశారు. అలాగే… ఈ నెల 20 న  అక్కడికి వెళ్లాల్సిన ట్రెయిన్ ని కూడా క్యాన్సిల్ చేశారు.