వాహనదారులకు మరో షాక్.. వరుసగా ఏడురోజు పెరిగిన పెట్రోల్ ధరలు.. డీజిల్ కూడా పైపైకి..

|

Dec 07, 2020 | 11:37 AM

వాహనదారులకు మరో సారి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా వరుసగా ఏడో రోజు చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచాయి. సోమవారం లీటర్ పెట్రోల్ పై

వాహనదారులకు మరో షాక్.. వరుసగా ఏడురోజు పెరిగిన పెట్రోల్ ధరలు.. డీజిల్ కూడా పైపైకి..
Follow us on

వాహనదారులకు మరో సారి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా వరుసగా ఏడో రోజు చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచాయి. సోమవారం లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 26 పైసలు పెరిగాయి. అటు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.83.77, డీజిల్ రూ.73.93గా ఉంది. బ్యారెల్ ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్‏లో 49.07 డాలర్లుగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశీయ ధరల్లో కూడా పెరుగుతున్నట్లు ఆయిల్ ఉత్పత్తి సంస్థలు తెలిపాయి.

విదేశీ మారకపు రేటు, అంతర్జాతీయ ఆయిల్ రేట్లకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. ముంబయిలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.90.34, డీజిల్ ధర రూ.80.51కి చేరింది. హైదరాబాద్‏లో 87.06గా ఉంది. గత 17రోజుల్లో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై రూ.2.65, డీజిల్ ధర రూ.3.40 పెరిగింది.