Arvind Kejriwal: కూతురు పెళ్లి వేడుకలో పుష్ప-2 పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం.. వీడియో వైరల్‌!

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె హర్షితా కేజ్రీవాల్ వివాహం సంభవ్ జైన్‌తో ఏప్రిల్ 18,2025న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

Arvind Kejriwal: కూతురు పెళ్లి వేడుకలో పుష్ప-2 పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం.. వీడియో వైరల్‌!
Arvindkejriwal Dance

Edited By: Balaraju Goud

Updated on: Apr 19, 2025 | 10:21 PM

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె హర్షితా కేజ్రీవాల్ వివాహం సంభవ్ జైన్‌తో ఏప్రిల్ 18,2025న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ సీనియర్‌ నేతలు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుక సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బాంగ్రా నృత్యంతో అలరించగా, కేజ్రీవాల్ తన భార్య సునీతాతో కలిసి ‘పుష్ప 2’ పాటకు స్టెప్పులు వేశారు. ‘పుష్ప 2’ పాటకు కేజ్రీవాల్‌ స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఢిల్లీలోని ఓ హోటల్‌లో హర్షిత-సంభవ్‌ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ తన సతీమణి సునీతతో కలిసి డ్యాన్స్‌ చేశారు. హీరో అల్లు అర్జున్-రష్మిక మందన నటించిన బ్లాక్‌బాస్టర్‌ మూవీ ‘పుష్ప-2’సినిమాలోని ‘సూసేకీ’అనే హిందీ వెర్షన్ పాటకు కేజ్రీవాల్ దంపతులు స్టెప్పులు వేశారు. వీరే కాకుండా ఈ వేడుకలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా డ్యాన్స్‌లు చేశారు. వీరిద్దరి డన్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….