సంధి కుదిరింది, ప్రతిష్టంభన ముగుస్తోంది., లడాఖ్ లో పాంగాంగ్ సరస్సు వద్ద తొలగుతున్న ఉద్రిక్తతలు

భారత, చైనా దేశాల మధ్య మెల్లగా ఉద్రికతలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. లడాఖ్ వద్ద పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉభయ దేశాల సైనిక ట్యాంక్లు వెనక్కి తరలుతున్నాయి...

సంధి కుదిరింది, ప్రతిష్టంభన ముగుస్తోంది., లడాఖ్ లో పాంగాంగ్ సరస్సు వద్ద తొలగుతున్న ఉద్రిక్తతలు

Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 11, 2021 | 5:53 PM

భారత, చైనా దేశాల మధ్య మెల్లగా ఉద్రికతలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. లడాఖ్ వద్ద పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉభయ దేశాల సైనిక ట్యాంక్లు వెనక్కి తరలుతున్నాయి.  ఉభయ దేశాల సైనిక కమాండర్ల మధ్య పలు దఫాలుగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ  ఉద్రిక్తతలు మాత్రం సడలలేదు. ఈ  తరుణంలో  నెలల తరబడి  కొనసాగుతున్న ప్రతిష్టంభన క్రమంగా పరిష్కారమవుతోంది. ముఖ్యంగా పాంగాంగ్ సరస్సు వద్ద పరిస్థితి సడలింపునకు గాను తాజాగా రెండు దేశాల మధ్య ఒడంబడిక కుదిరిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం పార్లమెంటుకు తెలిపారు. ఈ లేక్ రెండు వైపులా ఏర్పాటు చేసిన రక్షణ స్థావరాలను తొలగిస్తామని ఉభయ దేశాల కమాండర్లు ఓ అంగీకారానికి వచ్చారని ఆయన చెప్పారు. ఈ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ పూర్తి అయిన తరువాత ఇతర చోట్ల కూడా ఈ విధమైన చర్యలు చేపట్టే విషయమై చర్చించేందుకు 48 గంటల్లో మిలిటరీ కమాండర్లు భేటీ అవుతారని ఆయన తెలిపారు. అటు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా రెండు దేశాల ఫ్రంట్ లైన్ దళాలు వెనక్కి మరలుతున్నాయని వెల్లడించింది.

పాంగాంగ్ సో ప్రాంతంలో మిలిటరీ ట్యాంక్ లు వెనక్కిమరలుతున్న దృశ్యాన్ని భారత రక్షణ శాఖ వర్గాలు వీడియోగా విడుదల చేశాయి.