
మహారాష్ట్రలోని పాల్ఘర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నలసపోరా ప్రాంతంలోని రద్దీగా ఉండే ద్వారకా రెస్టారెంట్లో మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్టుగా తెలిసింది. మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు పైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. మరోవైపు మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..