వ్యవసాయ బిల్లులపై వెల్లువెత్తిన రైతుల నిరసనలు

| Edited By: Pardhasaradhi Peri

Sep 21, 2020 | 6:40 PM

వివాదాస్పదమైన రైతు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ అప్పుడే దేశంలో చోట్ల అన్నదాతలు ప్రదర్శనలకు, రాస్తారోకో ఆందోళనలకు దిగుతున్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో..

వ్యవసాయ బిల్లులపై వెల్లువెత్తిన రైతుల నిరసనలు
Follow us on

వివాదాస్పదమైన రైతు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ అప్పుడే దేశంలో చోట్ల అన్నదాతలు ప్రదర్శనలకు, రాస్తారోకో ఆందోళనలకు దిగుతున్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు ఉద్యమాల బాట పట్టారు. వేలాది సంఖ్యలో రోడ్లమీద ప్రొటెస్ట్ చేస్తున్నారు, జాతీయ రహదారులను దిగ్బందిస్తున్నారు. ఈ నెల 25 న దేశ వ్యాప్త బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో సింగర్ దలేర్ మెహేందీ దిష్టిబొమ్మలను రైతులు  తగులబెట్టారు. వ్యవసాయ బిల్లులపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన వీడియో రిలీజ్ చేయడాన్ని వారు దుయ్యబడుతున్నారు.

ప్రభుత్వ చర్యను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పు పట్టగా, ఈ బిల్లులను ఆమోదించవద్దంటూ పలు రాజకీయ పార్టీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి లేఖ రాశాయి. అటు-సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్ బయట నిరవధిక నిరసనకు దిగాలని నిర్ణయించుకున్నారు. తమ నేత సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.  మరోవైపు..రాజస్థాన్ లో సుమారు 280 వ్యవసాయ మార్కెట్లను మూసివేశారు.