ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలో రెండు ఆఫీసుల్ని క్లోజ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ, ముంబైలో ఉన్న తన కార్యాలయాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది ట్విట్టర్. అయితే ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కంపెనీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు సమయం పడుతుందని తెలిపారుమస్క్.
గతేడాది భారీగా ఉద్యోగులపై వేటు వేసిన ట్విట్టర్..తాజాగా మన దేశంలో ఉన్న మూడు ఆఫీసుల్లో రెండింటిని మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ఎక్కువగానే ఉన్నా..ఆదాయం తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్‌లో తేలడంతో..ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్..సెటైరికల్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ సీఈవో గా తన పెంపుడు కుక్క ఫ్లోకీని ప్రకటిస్తూ మస్క్ చేసిన ట్వీట్‌పై సెటైర్లు వేశారు. నా వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ని పొందడానికి చాలా సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదంటూ సరదాగా ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
No wonder it’s taking inordinately long to get my verification badge ?
The new CEO looks cool ? https://t.co/mq2c9H85be
— KTR (@KTRBRS) February 17, 2023