Election Commission: ఎన్నికల కమిషన్ నియామకంలో ప్రస్తుతం ఉన్న పద్ధతి మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్!

Election Commission:  ఎన్నికల కమిషన్ నియామకంలో ప్రస్తుతం ఉన్న పద్ధతులు మార్చాల్సి ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అభిప్రాయపడుతోంది.

Election Commission: ఎన్నికల కమిషన్ నియామకంలో ప్రస్తుతం ఉన్న పద్ధతి మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్!
Election Commission
Follow us

|

Updated on: May 18, 2021 | 9:30 AM

Election Commission:  ఎన్నికల కమిషన్ నియామకంలో ప్రస్తుతం ఉన్న పద్ధతులు మార్చాల్సి ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అభిప్రాయపడుతోంది. దీనికోసం ఈ సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్‌ను రాజకీయ లేదా కార్యనిర్వాహక జోక్యం నుండి నిరోధించాల్సిన అవసరాన్ని ఆ పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ద్వారా ఈ ఎంపిక జరిగాల్సి ఉందని సంస్థ తన పిటిషన్ లో తెలిపింది. మార్చి 2015 లా కమిషన్ 255 వ నివేదికను ప్రస్తావిస్తూ, ఈ ఎన్జిఓ తన సిఫారసులను అంగీకరించాలని , ఎన్నికల కమిషనర్లను నియమించే అధికారాన్ని అధిక శక్తితో కూడిన కమిటీకి ఇవ్వమని విజ్ఞప్తి చేసింది.

“ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకం కేవలం ఎగ్జిక్యూటివ్ చేత నియమించా తగ్గది కాదు. రాజ్యాంగంలోని ఉపోద్ఘాతం, ప్రాథమిక లక్షణాలలో పొందుపరచబడిన విలువలకు విరుద్ధంగా ప్రస్తుత ఎంపిక విధానం ఉంది.” అని సంస్థ తెలిపింది. “ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగం..ప్రాథమిక నిర్మాణం లోని ఒక అంశం. మన దేశంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్ధారించడానికి, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడానికి, ఎన్నికల కమిషన్ రాజకీయ, కార్యనిర్వాహక జోక్యం నుండి నిరోధించబడాలి” అని పిటిషన్ పేర్కొంది.

ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో పలువురు నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఎన్నికల కమిషన్ ఎంపిక విధానంలో మార్పులు జరగాలని కోరుతున్నాయి. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేయలేదు ఎన్నికల కమిషన్. దీంతో కరోనా మరింత ఎక్కువగా వ్యాప్తి చెందిందని  నిపుణుల అభిప్రాయం. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని పలు సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల ఎన్నికల విషయాల్లో దుమారం రేగిన సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ పై నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Raghu Rama Krishna Raju: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణంరాజు.. నేడు వైద్య పరీక్షలు..

గుజరాత్‌లో దారుణ ఘటన.. టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ బాలుడు మృతి..వైరల్ గా మారిన బాలుడి వీడియో .:viral video.