
వాహనదారులకు ఇది గుడ్ న్యూస్. ఇక మీరు వాహనంపై వెళ్లేటప్పుడు టోల్ గేట్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. ఇక రయ్ రయ్ అంటూ నాన్ స్టాఫ్‌గా దూసుకెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా కూడా నగదు అవసరం లేకుండా డైరెక్ట్‌గా టోల్ ఫీజు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల టోల్ గేట్ వద్ద వేచిచూసే సమయం భారీగా తగ్గింది. అయినా పండుగల రద్దీ సమయంలో వాహనదారులు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఫాస్టాగ్ స్కానర్ ద్వారా పేమెంట్ ప్రక్రియ పూర్తి చేసుకుని వెళ్లాలంటే ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు దీనికి కూడా చెక్ పడింది. ఇక మీరు టోల్ గేట్ల దగ్గర ఒక్క నిమిషం కూడా ఆగాల్సిన అవసరం ఉండదు.
ఫాస్టాగ్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్న్రైజేషన్ ఆధారిత మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ కలెక్షన్ సిస్టమ్ త్వరలో రాబోతుంది. ఈ సిస్టమ్ ద్వారా టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. రోడ్లపై కొన్ని చోట్ల కెమెరాలతో కూడిన ప్రత్యేక స్ట్రక్చర్లు ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు నెంబర్ ప్లేట్లను స్కాన్ చేసి ఆటోమేటిక్‌గా టోల్ కట్ అయ్యేలా చేస్తాయి. దీని వల్ల మీరు ఒక్క నిమిషం కూడా ఎక్కడా ఆగే పని ఉండదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 టోల్ ప్లాజాల్లో ఈ తరహాలో పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశముంది.
ఆటోమేటిక్ పేమెంట్స్ స్వీకరించే కాంట్రాక్ట్‌ను పలు టోల్ ప్లాజాల వద్ద జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ మేరకు ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డెడికేటెడ్ షార్ట్-రేంజ్ కమ్యూనికేషన్‌తో పాటు డియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ టెక్నాలజీలతో కలిసి ఈ కొత్త టోల్ వ్యవస్థ పనిచేస్తుంది. రానున్న రోజుల్లో ఈ కొత్త టోల్ వ్యవస్థ దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని తెలుస్తోంది. దీని వల్ల వాహనదారులకు సమయం ఆదా కానుంది.
🚨India rolls out multi-lane free flow tolling syste. pic.twitter.com/YsAH8xTHf8
— Indian Infra Report (@Indianinfoguide) October 13, 2025