Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు విడుదల.. ఈ స్టేట్‌లో ఎన్ని ఖాళీ కాబోతున్నాయంటే?

Rajya Sabha Election Schedule: దేశంలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల కోసం ఈసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిందిజ. దేశ వ్యాప్తంగా మొత్తం పది రాష్ట్రాల్లోని ఈ 24 స్థానాలు ఖాళీ కాబోతున్నట్టు ఈసీ పేర్కొంది. దీంతో ఈ స్థానలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది.

Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు విడుదల.. ఈ స్టేట్‌లో ఎన్ని ఖాళీ కాబోతున్నాయంటే?
Rajya Sabha Election Schedule Release

Updated on: May 22, 2026 | 10:27 AM

దేశంలో ఖాళీ అవ్వబోతున్న రాజ్యసభ స్థనాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లో ఖాళీకాబోతున్న 24 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికలు జరపనుంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.. జూన్ 1వ తేదీన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అవుతుంది. జూన్ -1 నుంచి 8వ తేదీ వరకు మినేషన్లు స్వీకరిస్తారు. ఇక జూన్ 9వ తేదీన నామినేషన్ పరిశీలన జరుగుతుంది. జూన్ 11వ తేదీన వరకు నామినేషన్లను ఉపసంహరింను సమయం ఉంటంది.

ఇక జూన్ 18వ రాష్ట్రంలోని ఖా తేదీన పోలింగ్ జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు జరగనున్నట్టు ఈసీ పేర్కొంది. ఇక జూన్ 20వ తేదీ నాటికి రాజ్యసభ ఎన్నికలు పూర్తవుతాయని స్పష్టం చేసింది.

రాష్ట్రాల వారీగా ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలు

ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో నాలుగేసి స్థానాలు ఖాళీ కానున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో మూడేసి స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లలో ఒక్కో స్థానం ఖాళీ కానుంది. అదనంగా, జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్రలలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరగవచ్చని ఈసీ పేర్కొంది. పదవీ విరమణ చేస్తున్న 22 మంది ఎంపీలలో 11 మంది బీజేపీకి చెందినవారు కాగా, నలుగురు కాంగ్రెస్‌కు చెందినవారు ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us