మూడు రోజుల్లోగా ఎన్నికల గైడ్ లైన్స్, ఈసీ కసరత్తు

కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలకు...ఈసీ.. (ఎన్నికల కమిషన్) మరో మూడు రోజుల్లోగా మార్గదర్శక సూత్రాలను రూపొందించనుంది. బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్టాల్లో..

మూడు రోజుల్లోగా ఎన్నికల గైడ్ లైన్స్, ఈసీ కసరత్తు

Edited By:

Updated on: Aug 18, 2020 | 5:37 PM

కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలకు…ఈసీ.. (ఎన్నికల కమిషన్) మరో మూడు రోజుల్లోగా మార్గదర్శక సూత్రాలను రూపొందించనుంది. బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్టాల్లో ఈ సంవత్సరాంతంలోను, వచ్ఛే ఏడాది ఆరు నెలల కాలంలోనూ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బై పోల్స్ ను కూడా నిర్వహించనున్నారు. ఈ కోవిడ్ తరుణంలో ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చిన సలహాలు, చేసి న సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని ఈసీ అధికార ప్రతినిధి షెఫాలీ శరణ్ తెలిపారు. ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్లు సమగ్ర ప్రణాళికను రూపొందించవలసి ఉంటుందన్నారు.

బీహార్ లో అప్పుడే మెల్లగా ఎన్నికల వేడి మొదలైంది. ఆ రాష్ట్ర మంత్రి శ్యామ్ రజక్… జెడి-యు నుంచి బయటికి వచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ లో చేరనున్నారు. సీఎం నితీష్ కుమార్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్ లో కే ఖాళీ అయిన సుమారు 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.