రాహుల్ వ్యాఖ్యపై ఈసీ ఆరా.. ఝార్ఖండ్ అధికారులకు ఆదేశం

‘ రేప్ ఇన్ ఇండియా ‘ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై వాస్తవ నివేదిక పంపవలసిందిగా ఎన్నికల సంఘం (ఈసీ) ఝార్ఖండ్ ఎన్నికల అధికారులను కోరింది. ఈ మేరకు వారికి లేఖ రాసింది. గతవారం ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్.. ఈ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, ఇది ప్రధాని మోదీ ప్రకటిస్తున్న ‘ మేకిన్ ఇండియా ‘ కాదని, ఇది ‘ రేప్ ఇన్ ఇండియా ‘ […]

రాహుల్ వ్యాఖ్యపై ఈసీ ఆరా.. ఝార్ఖండ్ అధికారులకు ఆదేశం
Follow us

|

Updated on: Dec 16, 2019 | 3:34 PM

‘ రేప్ ఇన్ ఇండియా ‘ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై వాస్తవ నివేదిక పంపవలసిందిగా ఎన్నికల సంఘం (ఈసీ) ఝార్ఖండ్ ఎన్నికల అధికారులను కోరింది. ఈ మేరకు వారికి లేఖ రాసింది. గతవారం ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్.. ఈ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, ఇది ప్రధాని మోదీ ప్రకటిస్తున్న ‘ మేకిన్ ఇండియా ‘ కాదని, ఇది ‘ రేప్ ఇన్ ఇండియా ‘ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనిపై కొందరు బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తూ.. రాహుల్ కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా-ఝార్ఖండ్ ఎన్నికల అధికారులనుంచి నివేదిక అందిన అనంతరం రాహుల్ పై చర్య తీసుకునే విషయమై యోచిస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన ‘ భారత్ బచావో ‘ ర్యాలీలో పాల్గొన్న రాహుల్… తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కూడా ప్రకటించారు.