పర్యటనలో శాంతికి విఘాతం కలిగించవద్దు : జమ్ము కశ్మీర్ ప్రభుత్వం

| Edited By:

Aug 24, 2019 | 1:06 AM

కశ్మీర్ లోయలో శాంతిని భంగపరచవద్దంటూ రాహుల్ గాంధీ బృందం జమ్ము కశ్మీర్ పర్యటన సందర్భంగా వారికి అక్కడి ప్రభుత్వం విఙ్ఞప్తి చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జమ్ము కశ్మీర్ పరిస్థితిని సమీక్షించడానికి కశ్మీర్ సందర్శించాలన్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ చేసిన ప్రతిపాదనను రాహుల్ గాంధీ అంగీకరించారు. దీంతో రాహుల్‌తో పాటు మరో తొమ్మిది రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అక్కడ శనివారం పర్యటించనున్నారు.ఈ సందర్భంగా  సాధారణ జీవితాలను క్రమంగా పునరుద్ధరించే […]

పర్యటనలో శాంతికి విఘాతం కలిగించవద్దు : జమ్ము కశ్మీర్ ప్రభుత్వం
Follow us on

కశ్మీర్ లోయలో శాంతిని భంగపరచవద్దంటూ రాహుల్ గాంధీ బృందం జమ్ము కశ్మీర్ పర్యటన సందర్భంగా వారికి అక్కడి ప్రభుత్వం విఙ్ఞప్తి చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జమ్ము కశ్మీర్ పరిస్థితిని సమీక్షించడానికి కశ్మీర్ సందర్శించాలన్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ చేసిన ప్రతిపాదనను రాహుల్ గాంధీ అంగీకరించారు. దీంతో రాహుల్‌తో పాటు మరో తొమ్మిది రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అక్కడ శనివారం పర్యటించనున్నారు.ఈ సందర్భంగా  సాధారణ జీవితాలను క్రమంగా పునరుద్ధరించే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఆంక్షలను సీనియర్ నేతలు ఉల్లంఘించవద్దంటూ అక్కడి ప్రభుత్వం విఙ్ఞప్తి చేస్తూ ఓ  ట్వీట్ చేసింది. సరిహద్దు ఉగ్రవాదం మరియు ఇతర బెదిరింపుల నుండి ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఎలాంటి అసౌకర్యానికి గురిచేయవద్దంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.  మరోవైపు నేతలు జమ్ము కశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్ సందర్శించవద్దని కూడా ప్రభుత్వం కోరింది.