Education Loans Waive : విద్యా రుణాలను మాఫీ చేస్తాం… డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్

విద్యార్థులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. ఆయన ప్రజా గ్రామ సభ సమావేశంలో...

Education Loans Waive : విద్యా రుణాలను మాఫీ చేస్తాం... డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్

Edited By:

Updated on: Jan 04, 2021 | 5:08 AM

విద్యార్థులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. ఆయన ప్రజా గ్రామ సభ సమావేశంలో పాల్గొని మాట్లడారు. కాగా, తమిళనాడులో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంకే చీఫ్ ఎన్నికల విద్యా రుణాల మాఫీ వాగ్ధానాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో డీఎంకేను గెలిపిస్తే ఉన్నత చదువుల కోసం విద్యార్థులు తీసుకున్న లోన్లను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, విద్యాప్రమాణాలు దిగజారిపోయాయని విమర్శించారు.

 

గ్రామీణులకు వంద రోజుల పనిని మంజూరు చేయడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తిరిగి గాడిలో పెడతామన్నారు. వంద రోజుల పనిని 150 రోజులకు పెంచాలని, వేతనాలు రోజువారీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామన్నారు. కాగా, అంతకుముందు పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీర పాండ్య కట్టబొమ్మన్‌ 262వ జయంతిని పురస్కరించుకుని స్టాలిన్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Also Read: మా రాష్ట్రాన్ని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు, కానీ వారి ఆటలు సాగవు, పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్,