సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushanth singh Rajput) వద్ద మేనేజర్ గా పనిచేసిన దిశా సాలియన్ (Disha Salian) అనుమానాస్పద మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. రాజకీయ కారణాలతో తన కుమార్తె పేరును చెడుగా ఉపయోగిస్తున్నారంటూ దిశా తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. నిత్యం తమకు ఎదురవుతోన్న వేధింపులతో తమ జీవితం దారుణంగా మారిందని, తమకు న్యాయం(Justice) చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నడుమ తమ జీవితాలను ముగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు లేఖలో వాపోయారు. రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి కొన్ని రోజుల ముందే దిశా మృతి చెందారు. తమ కుమార్తె పేరును చెడుగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని ప్రధానమంత్రి, హోం మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరామని దిశ తండ్రి తెలిపారు. దిశా సాలియన్, సుశాంత్ సింగ్ ల మృతి 2020లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
దిశ గదిలో కొందరు వ్యక్తులు ప్రవేశించి అత్యాచారం చేశారని చెబుతున్నారని నారాయణ్, నితేశ్ లు చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో తాము తలెత్తుకోలేకపోతున్నామని వాపోయారు. వీరి తప్పుడు ఆరోపణలతో నా కుమార్తె వ్యక్తిత్వాన్ని కించపర్చడం తమను తీవ్రంగా గాయపర్చిందని చెప్పారు. వీటన్నింటిని చూసి, చనిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నాం. మమ్మల్ని ఇంత క్షోభకు గురిచేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేకపోతే మాకు చావే శరణ్యం’ అంటూ లేఖలో తీవ్రంగా వాపోయారు.
‘నా కుమార్తె పేరును చెడుగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు విజ్ఞప్తి చేశాం. నా కుమార్తె మరణం, ఆ తర్వాత చోటుచేసుకున్న సుశాంత్ మృతితో ముడిపెడుతూ సోషల్ మీడియాలో కొందరు ఆవాస్తవాలను ప్రచారం చేశారు. ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, నారాయణ్ రాణె, నితేశ్ రాణె ఈ విషయానికి స్పందించారు. రాజకీయం చేశారు. మా జీవితాలను దుర్భరంగా మార్చారు. జూన్ 4, 2020 నుంచి నా కుమార్తె తను ఉండే ఇంటి నుంచి బయటకు రాలేదని తన స్నేహితుల ద్వారా తెలిసింది. అక్కడున్న సీసీ కెమెరాల ద్వారా అసలు విషయం బయటపెట్టండి”
– దిశ తండ్రి
Also Read
Inspector Suspended: పట్టుకున్న సొమ్ముతో పరార్.. కర్నూలు సీఐపై రాముడుపై సస్పెన్షన్ వేటు..
Digestive system: జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే వీటిని తినండి.. సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి..!
SBI: ఖాతాదారులకు గమనిక.. ఏపీలో రేపు, ఎల్లుండి ఎస్బీఐ బ్యాంకులు తెరిచి ఉంటాయి.. ఎక్కడంటే..