Dhyanalinga 25th Anniversary: వైభవంగా ధ్యానలింగ 25వ వార్షికోత్సవ మహోత్సవం.. మతాలకు అతీతంగా ఆకట్టుకున్న సంగీతాలాపన

|

Jun 25, 2024 | 6:36 PM

తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రసిద్ధ ఈశా యోగా కేంద్రంలో ధ్యానలింగ 25వ వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం (జూన్ 24) ఇక్కడ పలు కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. వార్షికోత్సవ కార్యక్రమం హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ఇస్లామిక్ సూఫీ మతాలకు చెందిన కీర్తనలు, మంత్రోచ్ఛారణలు మధ్య ఘనంగా జరిగింది..

Dhyanalinga 25th Anniversary: వైభవంగా ధ్యానలింగ 25వ వార్షికోత్సవ మహోత్సవం.. మతాలకు అతీతంగా ఆకట్టుకున్న సంగీతాలాపన
Dhyanalinga 25th Anniversary
Follow us on

కోయంబత్తూరు, జూన్‌ 25: తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రసిద్ధ ఈశా యోగా కేంద్రంలో ధ్యానలింగ 25వ వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం (జూన్ 24) ఇక్కడ పలు కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. వార్షికోత్సవ కార్యక్రమం హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ఇస్లామిక్ సూఫీ మతాలకు చెందిన కీర్తనలు, మంత్రోచ్ఛారణలు మధ్య ఘనంగా జరిగింది. ధ్యానలింగం అనేది ఏదైన నిర్దిష్ట మత విశ్వాసానికి సంబంధంలేనిది. ఇదొక ధ్యాన స్థలం. ఇక్కడ ఏదైనా ప్రత్యేక మతానికి చెందిన ఆచారాలు, ప్రార్థనలు, ఆరాధనలు ఉండవు. అంటే సర్వ మతాలకు ఇది అవాసం వంటిది. ధ్యానలింగం దాని పరిధిలోకి వచ్చే ప్రతి మనిషికి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించే అవకాశాన్ని సృష్టిస్తుంది.

ధ్యానలింగ 25వ వార్షికోత్సవాలు ఎలా జరిగాయంటే..

ఈ ఏడాది ధ్యానలింగ పవిత్రోత్సవాలు సోమవారం ఉదయం 6 గంటలకు ఈశా బ్రహ్మచారులు, బ్రహ్మచారిణుల ‘ఔం నమః శివాయ’ మంత్రోచ్ఛారణతో ప్రారంభమైంది. అనంతరం ఆదిశంకరాచార్య స్వరపరిచిన ‘నిర్వాణ శతకం’ పఠనం జరిగింది. మయిలై సద్గురునాథన్ ‘తేవారం’ ప్రదర్శించారు. దీని తర్వాత ‘సెరా మే’ బౌద్ధ విహారం నుంచి వచ్చిన సన్యాసులు బౌద్ధ మంత్రాలను పఠించారు. అనంతరం కోయంబత్తూరుకు చెందిన ఎఫ్‌ఎస్‌పీఎం సిస్టర్స్‌ ‘క్రైస్తవ కీర్తనలు’ఆలపించారు. చిదంబరం ఆలయ దీక్షితులు ‘రుద్ర-సమక వేదకోశ గానం’ చేశారు.

దీని తర్వాత జరిగిన నాద ఆరాధన ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. కేవలం సంగీత వాయిద్యాలతో మాత్రమే ఆలపించిన గుర్బానీ కీర్తనలు గురుద్వారా సింగ్ సభలో శ్రావ్యమనోహరంగా ఆలపించారు. ఈశా సంస్కృతి విద్యార్థులు సంస్కృత శ్లోకాలు పఠించారు. అనంతరం ప్రత్యేక అతిథులు ఇస్లామిక్ గీతాలను గానం చేశారు. ఈశా రెకసిడెన్స్‌ ‘సుఫీ కీర్తనలు’, ‘సౌండ్స్ ఆఫ్ ఇషా’ పాటలను భక్తి పూర్వకంగా ఆలపించారు. తర్వాత గురు పూజ జరిగింది. చివరిగా గుండెచా బ్రదర్స్‌ మ్యూజికల్‌ ప్రదర్శనతో వేడుకలు ముగిశాయి. కాగా ఈశాలోని ధ్యానలింగాన్ని 1999లో జూన్ 24న సద్గురు చేతుల మీదగా ప్రతిష్ఠించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.