PM Modi: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన ప్రధాని మోడీ

|

Jun 25, 2024 | 5:04 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. మంగళవారం ఢిల్లీలోని త్యాగరాజ్‌ మార్గ్‌లోని వెంకయ్య నాయుడు నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ జాతీయ ప్రయోజనాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. వీరిద్దరి భేటీపై మోడీ ట్వీట్‌ చేశారు. తాను వెంకయ్య నాయుడును కలిశానని, ఆయనతో దశాబ్దాలుగా.

PM Modi: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన ప్రధాని మోడీ
Pm Modi
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. మంగళవారం ఢిల్లీలోని త్యాగరాజ్‌ మార్గ్‌లోని వెంకయ్య నాయుడు నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ జాతీయ ప్రయోజనాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. వీరిద్దరి భేటీపై మోడీ ట్వీట్‌ చేశారు. తాను వెంకయ్య నాయుడును కలిశానని, ఆయనతో దశాబ్దాలుగా పని చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. భారతదేశ పురోగతి పట్ల ఆయన వివేకం, అభిరుచిని ఎప్పుడూ ప్రశంసించానని అన్నారు.

 


అలాగే మోడీ తన నివాసానికి వచ్చి కలిశారని, భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోడీకి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశాని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సందర్భంగా మా అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాము. నరేంద్ర మోడీ నాయకత్వంలో రాబోయే సంవత్సరాలలో భారత్ మరింత ప్రకాశిస్తుందని, సరి కొత్త శిఖరాలకు చేరుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.