యూట్యూబ్‌ చూసి దొంగతనం నేర్చుకున్న జంట.. గుట్టురట్టు చేసిన పోలీసులు.. ఆఖరులో అదిరిపోయే ట్విస్ట్‌..

|

Feb 02, 2023 | 2:08 PM

అరెస్టు చేసిన వారి నుంచి బంగారు ఆభరణాలు, నగదు సహా మొత్తం రూ.40 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేవలం నెల రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించడం విశేషం. ఇక ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే..

యూట్యూబ్‌ చూసి దొంగతనం నేర్చుకున్న జంట.. గుట్టురట్టు చేసిన పోలీసులు.. ఆఖరులో అదిరిపోయే  ట్విస్ట్‌..
Chori
Follow us on

ఈ రోజుల్లో సోషల్ మీడియా దుర్వినియోగం పెరిగిపోతోంది. యూట్యూబ్ చూసి దొంగతనం గురించి తెలుసుకుని ఒక బ్యాంకులో దోపిడీకి పాల్పడిన నిందితులను కర్ణాటక హుబ్లీలోని ధార్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ధార్వాడలోని బీరేశ్వర్‌ కో ఆప్‌ క్రెడిట్‌ సొసైటీలో ఇటీవల జరిగిన చోరీ కేసును ధార్వాడ నగర పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. అరెస్టు చేసిన వారి నుంచి 600 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి బెల్గాంకు చెందిన వైష్ణవి, అదే సొసైటీ మాజీ ఉద్యోగి యువరాజ్‌లను నిందితులుగా గుర్తించారు. ఫిర్యాదు నమోదు కావడంతో ముమ్మర గాలింపు చేపట్టారుసిటీ పోలీసులు..కేసు విచారణలో వేగంగా స్పందించిన పోలీస్‌ బృందానికి పోలీస్ కమిషనర్ రమణ్ గుప్తా 25 వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు.

డిసెంబర్ 31న బీరేశ్వర్ కో ఆప్ క్రెడిట్ సొసైటీలో చోరీ జరిగింది. సొసైటీలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును అపహరించిన నిందితులు సొసైటీలోని సీసీ కెమెరాలకు నిప్పంటించి పరారయ్యారు. యూట్యూబ్ చూసి దొంగతనాలు చేయడం నేర్చుకున్న అతడు చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు టేక్నాలజీ సాయంతో విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ రమణ్ గుప్తా తెలియజేశారు. అరెస్టు చేసిన వారి నుంచి బంగారు ఆభరణాలు, నగదు సహా మొత్తం రూ.40 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేవలం నెల రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించడం విశేషం.

ప్రస్తుతం నిందితులు యువరాజ్, వైష్ణవిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపగా, వారితో పాటు మరికొందరు కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ ప్రారంభించారు. నిందితులు యూట్యూబ్ చూసి దొంగతనాలు నేర్చుకున్నారని, ఇప్పుడు వీరి వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో తీగలాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చోరీకి పాల్పడిన యువరాజ్, వైష్ణవిలకు బ్యాంకు కనెక్షన్ ఉన్నట్లు విచారణలో తేలింది. నిందితుడు యువరాజ్‌ జోల్లే గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ప్రధాన కార్యాలయం ఉన్న యక్సాంబ గ్రామ నివాసి అని, బీరేశ్వర్‌ కో ఆప్‌ సొసైటీ మాజీ ఉద్యోగి అని తెలిపారు. దొంగతనం కేసులో అతనికి సహాయం చేసిన వైష్ణవి ధార్వాడ నివాసి, అంతేకాదు.. బీరేశ్వర్ కోప్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ కుమార్తె.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి