కరోనా వైరస్ బారిన పడి దాని నుంచి పూర్తిగా కోలుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ప్లాస్మాను కటక్ లోని ఎస్ సీ బీ మెడికల్ కాలేజీ కమ్ ఆసుపత్రికి ఇచ్చారు. కోవిడ్ పై పోరులో ఇలా తనవంతు కృషి చేసినందుకు ఎంతో తృప్తిగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. గత జులైలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. కోవిడ్ నుంచి కోలుకుని తన ప్లాస్మాను దానం చేసిన తొలి కేంద్రమంత్రి అయ్యారు ధర్మేంద్ర ప్రధాన్ ! తనలాగే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడిన రోగులు తమ ప్లాస్మాను దానం చేయాలని ఆయన కోరుతున్నారు.
Donated plasma at SCB Medical College and Hospital at Cuttack today. It is immensely satisfying to do my bit towards the fight against the #COVID-19 pandemic. pic.twitter.com/OWMk5VzHA7
— Dharmendra Pradhan (@dpradhanbjp) October 3, 2020