Mosquito coil: మస్కిటో కాయిల్‌ పొగ పీల్చి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

|

Mar 31, 2023 | 2:16 PM

మస్కిటో కాయిల్‌ వల్ల ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన శుక్రవారం నాడు ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Mosquito coil: మస్కిటో కాయిల్‌ పొగ పీల్చి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
Mosquito Coil
Follow us on

మస్కిటో కాయిల్‌ వల్ల ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన శుక్రవారం నాడు ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఢిల్లీలోని శాస్త్రి పార్క్ సమీపంలోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలపై కాలిన గాయాలు ఉండటంతో మస్కిటో కాయిల్ వల్ల పరుపుకు మంటలు అంటుకుని ఉంటాయని, ఫలితంగా దట్టమైన విషపూరిత పొగలు అలముకుని నిద్రపోతున్నవారు స్పృహ కోల్పోయి ఉంటారు. అనంతరం మంటల్లో మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతుల్లో ఆరు నెలల పసికందుతోపాటు ఓ మహిళ, నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.