Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. కవితకు బినామీ అంటూ ఇచ్చిన వాగ్మూలం వెనక్కి..

ఢిల్లీ లిక్కర్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసిన ఈడీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాలని నోటీసులు..

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. కవితకు బినామీ అంటూ ఇచ్చిన వాగ్మూలం వెనక్కి..
Delhi Liquor Case

Updated on: Mar 10, 2023 | 2:54 PM

ఢిల్లీ లిక్కర్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసిన ఈడీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాలని నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కొత్త మెలిక చోటు చేసుకుంది. ఈ కేసులో ఉన్న అరుణ్‌ పిళ్ళై.. తాను ఇచ్చిన వాగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పెషల్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తాను కవితకు బినామీ అంటూ ఈడీకి ఇంతకు ముందు వాగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ఆ వాగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అరుణ్‌ పిళ్ళై పిటిషన్‌ దాఖలు చేశారు. పిళ్ళై పిటిషన్‌తో స్పెషల్‌ కోర్టు ఈడీకి నోటిసులు జారీ చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us