Deer With Jawans: ఛత్తీస్‌గఢ్ ఒరిస్సా సరిహద్దులో వింత ఘటన.. సైనికులతో నేను సైతం అంటున్న జింక..!

Deer With Jawans: మనుషులతో కుక్కల విధేయత గురించి తెలుసు..కానీ, పోలీసులకు ఓ జింక సాయం చేయటం ఎప్పుడైనా చూశారా..? అంటే అవుననే అంటారు..కానీ,

Deer With Jawans: ఛత్తీస్‌గఢ్ ఒరిస్సా సరిహద్దులో వింత ఘటన.. సైనికులతో నేను సైతం అంటున్న జింక..!
Deer

Updated on: Dec 09, 2021 | 9:57 AM

Deer With Jawans: మనుషులతో కుక్కల విధేయత గురించి తెలుసు..కానీ, పోలీసులకు ఓ జింక సాయం చేయటం ఎప్పుడైనా చూశారా..? అంటే అవుననే అంటారు..కానీ, ఇక్కడ చూడండి ఓ జింక జవాన్లతో పాటు అడవిలో కూంబింగ్‌ నిర్వహిస్తోంది..జింక కూంబింగ్ కు వెళ్ళటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా… కానీ ఇది నిజం. ఈ ఫోటోలు చూస్తే మీకే తెలుస్తుంది. ఛత్తీస్ గడ్ ఒరిస్సా రాష్ట్రంలో జవాన్లతో కలిసి జింక కూంబింగ్ చేస్తోంది. ఒడిశా లోని కోరాపుట్ జిల్లాకి సరిహద్దున ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుస్తారం లో ఈ వింత చోటు చేసుకొంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియోలు, షోటోలు సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి…

మావోయిస్టులకు గట్టి బలం ఉన్న దుర్గమ అడవిలో కూంబింగ్ కి వెళ్లిన జవాన్లు ఒక గాయపడిన జింకను రక్షించారు. తమ క్యాంప్ కి తీసుకొని వెళ్లి సంరక్షణ చేశారు. చికిత్స చేసిన అనంతరం జింకను తిరిగి అడవిలో వదిలేశారు. అయితే, ఆ జింక మాత్రం అడవుల్లో వారితో పాటు తిరుగుతుంటుంది. అడవిలో వదిలి వెళ్లినా తిరిగి తమ వెంటే వస్తుందని చెబుతున్నారు జవాన్లు. ఇప్పుడికా దానికి బ్యూటీ అని పేరు పెట్టారు జవాన్లు.

Also read:

 Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..

Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..