Waqf Act: వక్ఫ్ సవరణ చట్టంపై ప్రధాని మోదీకి దావూదీ బోహ్రా కమ్యూనిటీ కృతజ్ఞతలు!
దావూదీ బోహ్రా సమాజం ప్రతినిధులు వక్ఫ్ చట్టం సవరణకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టం తమ సమాజం కోసం ఎంతోకాలంగా కోరుకుంటున్న డిమాండ్ అని వారు పేర్కొన్నారు. "సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" దార్శనికతకు మద్దతు తెలిపారు. దేశంలోని ఇతర ముస్లిం సమూహాల వ్యతిరేకత నేపథ్యంలో ఈ కృతజ్ఞతలు ప్రాధాన్యత సంతరించుకుంది.
వక్ఫ్ సవరణ చట్టం చేసినందుకు దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. గురువారం ప్రధాని మోదీని కలిసిన బృంద సభ్యులు ఈ కొత్త చట్టంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ సమాజం తరఫున చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అని వారు చెప్పారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే ప్రధానమంత్రి దార్శనికతపై వారు విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఓ వైపు దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే.. దావూదీ బోహ్రా కమ్యూనిటీ వాళ్లు ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలియజేయండి ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి