Biparjoy Cyclone: తీవ్రరూపం దాల్చుతోన్న ‘బిపర్‌జోయ్‌’ తుపాను.. రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు

అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపర్‌జోయ్‌' తుపాను తీవ్ర రూపం దాల్చనుంది. రాబోయే 36 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదలనుందని భరాత వాతావరణ శాఖ శుక్రవారం (జూన్‌ 9) పేర్కొంది. ప్రస్తుతం గోవా, ముంబాయ్‌కి పశ్చిమ నైరుతి దిశలో..

Biparjoy Cyclone: తీవ్రరూపం దాల్చుతోన్న బిపర్‌జోయ్‌ తుపాను.. రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు
Biporjoy Cyclone

Updated on: Jun 09, 2023 | 1:48 PM

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపర్‌జోయ్‌’ తుపాను తీవ్ర రూపం దాల్చనుంది. రాబోయే 36 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదలనుందని భరాత వాతావరణ శాఖ శుక్రవారం (జూన్‌ 9) పేర్కొంది. ప్రస్తుతం గోవా, ముంబాయ్‌కి పశ్చిమ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. 135 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో ద్రోణి కదులుతోంది. దీంతో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెల్పింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు తీరానికి తిరిగి రావాలని సూచించింది.

జూన్ 8న రాత్రి 11:30 గంటల సమయం నాటికి.. తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా కదులుతోన్న ద్రోణి గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 840 కిలోమీటర్లు, ముంబైకి పశ్చిమ-నైరుతి దిశలో 870 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెల్పింది. దీని ప్రభావంతో వచ్చే 2 రోజుల్లో వాతావరణం భీతావాహకంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.

మరోవైపు ‘బిపర్‌జోయ్‌’ తుపాను ప్రభావంతో గురువారం రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో దేశంలో వర్షాకాలం ప్రారంభమైంది. ఈ ఏడాది రుతుపవనాలు ఏడు రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. సాధారణ ఈ సీజన్‌లో జూన్ 1న రావల్సిన రుతుపవనాలు.. ఈ ఏడాది జూన్ 8న ప్రవేశించాయి. ఆదివారం నాటికి రుతుపవనాలు బెంగాల్‌కు చేరుకుంటాయి. ఆది, సోమవారాల్లో హౌరా, కోల్‌కతా, హుగ్లీ వంటి తీర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us