
India Coronavirus Updates: భారత్‌లో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో (సోమవారం) కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 2,288 కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చుకుంటే 919 కేసులు తగ్గాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 10 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 19,637 (0.05 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
దేశంలో నమోదైన కేసులు, రికవరీ వివరాలు..