సరికొత్త ప్రయోగం, 2-18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాక్సిన్, నిపుణుల కమిటీ సిఫారసు, ఇక 2, 3 క్లినికల్ ట్రయల్స్ కి భారత్ బయో టెక్ రెడీ ?

| Edited By: Anil kumar poka

May 12, 2021 | 10:28 AM

దేశంలో పిల్లలలకు కూడా కరోనా వైరస్ సోకుతోందని వార్తలు వస్తున్నతరుణంలో భారత్ బయో టెక్ సంస్థ వినూత్న ఆలోచన చేసింది. తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ని ఈ ఏజ్ గ్రూప్ వారికి కూడా ఇస్తే ఎలా ఉంటుందని భావించింది...

సరికొత్త ప్రయోగం, 2-18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాక్సిన్, నిపుణుల కమిటీ సిఫారసు, ఇక 2, 3 క్లినికల్ ట్రయల్స్ కి భారత్ బయో టెక్ రెడీ ?
Covaxin Recommended For Next Phase Of Trials For 2 18 Age Group
Follow us on

దేశంలో పిల్లలలకు కూడా కరోనా వైరస్ సోకుతోందని వార్తలు వస్తున్నతరుణంలో భారత్ బయో టెక్ సంస్థ వినూత్న ఆలోచన చేసింది. తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ని ఈ ఏజ్ గ్రూప్ వారికి కూడా ఇస్తే ఎలా ఉంటుందని భావించింది. అందుకే 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి తమ టీకామందు ఇచ్చేందుకు, ఇందుకు సంబంధించి 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థనను నిపుణుల కమిటీ దృష్టికి తేగా ఆ కమిటీ ఇందుకు సిఫారసు చేసింది. ఢిల్లీ లోని ఎయిమ్స్, పాట్నా లోని ఎయిమ్స్, నాగపూర్ లోని మెడిట్రినా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తో బాటు 525 చోట్ల ఈ రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. సెంట్రల్ డ్రగ్స్ ఆఫ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నిన్న ఈ ప్రతిపాదనపై లోతుగా చర్చించింది. 2 నుంచి 18 ఏళ్ళ లోపు వయస్సు వారిపై తమ ట్రయల్స్ నిర్వహణకు అనుమతినివ్వాలని భారత్ బయోటెక్ పెట్టుకున్న దరఖాస్తుపై ఈ కమిటీ సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పరీక్షల్లో సేఫ్టీ కి అత్యంత ప్రాధాన్యమివ్వాలని నిపుణుల బృందం ఈ కంపెనీని కోరింది. పిల్లలపై ప్రయోగాలంటే మాటలు కాదని, అందువల్ల ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది.

మొదట భద్రత, సురక్షిత అంశాలకు సంబంధించి హామీ ఇవ్వాలని సూచించింది. గత ఫిబ్రవరి 24 న జరిగిన ఓ సమావేశంలో ఈ విషయమై కమిటీ చర్చించింది. తమ సవరించిన క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ ని సమర్పించాలని భారత్ బయోటెక్ సంస్థను కమిటీ కోరింది.ఇప్పటికే కోవాగ్జిన్ వాక్సిన్ దేశంలో పాపులర్ అయింది.
మరిన్ని చదవండి ఇక్కడ : viral video : చెన్నై స్టేషన్ లోని పోలీసులు డాన్స్ లు ..తప్పు అయ్యినప్పటికీ ట్వీబుల్ నుండి ప్రసంశలు వెల్లువా వైరల్ అవుతున్న వీడియో
Viral Video : నాగుపామా..? అయితే నాకేంటి…షాకిచ్చిన బామ్మ.వామ్మో ఈ బామ్మ ధైర్యం చుస్తే షాక్ అవ్వాల్సిందే..(వీడియో).